ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఇంటర్న్ షిప్ అవకాశం యువతకు కల్పిస్తుంది ....

                      


                   ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఇంటర్న్ షిప్ 


ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో పనిచేయాలని కలలు కంటున్న యువతకు ఇదో గొప్ప అవకాశం. మీరు కూడా ఈ కలను నెరవేర్చుకోవాలనుకుంటే ఇస్రో ఇంటర్న్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఈ పథకం ద్వారా విద్యార్థులు సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగంలో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. మీరు కూడా ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నట్లయితే, కింద ఇచ్చిన విషయాలను జాగ్రత్తగా చదవండి..


                                                  కావలసిన అర్హత ప్రమాణాలు 

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సైన్స్ లేదా టెక్నాలజీ సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీని అభ్యసించాలి. లేదా దరఖాస్తు చేసిన తేదీ నుండి ఆరు నెలల్లోపు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన UG, PG, PhD విద్యార్థులు పొందవచ్చు. అయితే ఒక నెలలోపు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  •  అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 60% మార్కులు లేదా 10 స్కేల్‌లో 6.32 CGPA ఉండాలి

                                              స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ స్కీమ్

  • ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక విద్యా అర్హత (BE/B.Tech): 6వ సెమిస్టర్ పూర్తి చేసి ఉండాలి.
  • ME/M.Tech విద్యార్థులకు: మొదటి సెమిస్టర్ పూర్తి చేసి ఉండాలి.
  • B.Sc/Diploma విద్యార్థులకు: చివరి సంవత్సరంలో ఉండాలి.
  • MSc విద్యార్థులకు: మొదటి సెమిస్టర్ పూర్తి చేసి ఉండాలి.
  • పీహెచ్‌డీ విద్యార్థులకు: కోర్సు పూర్తి చేసి ఉండాలి

                                   ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ వ్యవధి

  • ఇంటర్న్‌షిప్ పథకం: ఈ పథకం వ్యవధి గరిష్టంగా 45 రోజులు

                                              ప్రాజెక్ట్ ట్రైనింగ్ స్కీమ్

  • ఇంజనీరింగ్, B.Sc/Diploma విద్యార్థులకు కనీసం 45 రోజులు.
  • ME/M.Tech, MSc విద్యార్థులకు కనీసం 120 రోజులు.
  • పీహెచ్‌డీ విద్యార్థులకు కనీస వ్యవధి 30 నెలలు

                                               స్టైపెండ్ & ఫైనాన్షియల్ అసిస్టెన్స్

  • ఇస్రో ఇంటర్న్‌షిప్ లేదా ప్రాజెక్ట్ ట్రైనీలు ఎలాంటి స్టైఫండ్, వేతనం లేదా ఆర్థిక సహాయం ప్రయోజనాన్ని పొందరు. ఈ పథకం విద్యా అనుభవంగా రూపొందించారు. దీనిలో విద్యార్థులు అంతరిక్ష శాస్త్రం, సాంకేతిక రంగంలో నిపుణులుగా మారడానికి అవకాశం పొందవచ్చు.
  • ఇంటర్న్‌షిప్ లేదా ప్రాజెక్ట్ శిక్షణ పూర్తయిన తర్వాత ఇస్రో సర్టిఫికేట్ ఇస్తుంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, అసైన్‌మెంట్ రిపోర్టు, డివిజన్ హెడ్‌లు మూల్యాంకనం చేసిన తర్వాత విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
  •  శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ISRO అధికారిక వెబ్‌సైట్  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ నిర్వహించే కేంద్రాలు, యూనిట్ల జాబితా కూడా వెబ్‌సైట్‌లో ఇవ్వబడింది. మరింత సమాచారం, దరఖాస్తు సంబంధిత సూచనల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాలను జాగ్రత్తగా చదవాలి
                                                    
                                                   ఇంటర్న్ షిప్ అప్లికేషన్ లింక్

Comments